Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 17th JANUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 17th JANUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 17th JANUARY 2024

1) బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ నివేదిక ప్రకారం గ్లోబల్ – 500 బ్రాండ్స్ లో భారత్ లో అత్యుత్తమ బ్రాండ్ గా ఏది నిలిచింది.?
జ : జియో (17), ఎల్ఐసీ (23), ఎస్‌బీఐ(24)

2) బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ నివేదిక ప్రకారం గ్లోబల్ – 500 బ్రాండ్స్ లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన సంస్థలు ఏవి.?
జ : WeChat, Youtube, Google

3) దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని 206 అడుగులతో ఎక్కడ నిర్మించారు.?
జ : విజయవాడ

4) అంతర్జాతీయ టి20 క్రికెట్ లో వరుసగా 5 అర్ద సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : సికిందర్ రాజా (జింబాబ్వే)

5) నీతి అయోగ్ పేదరిక నివేదిక ప్రకారం గత తొమ్మిది ఏళ్లలో పేదరికం నుంచి ఎంతమంది భారతీయులు బయటపడ్డారు.?
జ : 24.82 కోట్లు

6) లక్ష కోట్ల విలువ కలిగిన నాలుగో ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఏ బ్యాంకు నిలిచింది.?
జ : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI, BOB, PNB)

7) వివాహాల కోసం విదేశాలకు వెళ్లకుండా దేవభూమిగా పేరుందిన ఏ రాష్ట్రంలో వివాహాలు చేసుకోవాలని సెలబ్రిటీలను నరేంద్ర మోడీ కోరారు.?
జ : ఉత్తరాఖండ్

8) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తో ఏ సంస్థ విదేశాల్లో యూపీఐ చెల్లింపులు చేయడానికి ఒప్పందం చేసుకుంది.?
జ : గూగుల్ పే

9) ప్రభుత్వ రంగ సంస్థల్లో అత్యంత విలువైన సంస్థగా ఏ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను అధిగమించి మొదటి స్థానంలో నిలిచింది.?
జ : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి)

10) 2023 సంవత్సరంలో చైనా జనాభా ఎన్ని లక్షలు తగ్గిపోయింది.?
జ : 20.8 లక్షలు

11) ప్రపంచ చెస్ ఛాంపియన్ డింగ్ లిరెన్ పై విజయం సాధించిన భారత ఆటగాడు ఎవరు.?
జ : ప్రజ్ఞానందా

12) అంతర్జాతీయ టి20 క్రికెట్ లో అత్యధికంగా ఐదు సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : రోహిత్ శర్మ

13) అంతర్జాతీయ టి20 క్రికెట్ లో భారత్ తరఫున ఏ వికెట్ కైనా అత్యధిక పరుగులు భాగస్వామ్యం (190) నెలకొల్పిన జోడిగా ఏ జోడి నిలిచింది.?
జ : రోహిత్ శర్మ – రింకూ సింగ్

14) అంతర్జాతీయ టి20 క్రికెట్ లో అత్యధిక సిరీస్ లను క్లీన్ స్వీప్ (9) చేసిన దేశంగా ఏ దేశం నిలిచింది.?
జ : భారత్

15) కబీర్ కోహినూర్ సమ్మాన్ అవార్డుకు ఎంపికైన తెలంగాణ ఉపాధ్యాయురాలు ఎవరు.?
జ : విఎన్‌వీ పద్మావతి

16) రాయల్ మిస్టర్ ఇండియా టైటిల్ కైవసం చేసుకున్న విద్యార్థి ఎవరు.?
జ : కే. వరుణ్ చౌదరి

17) జపాన్ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు మొక్కలు ఏ రూపంలో మాట్లాడుకుంటాయని పరిశోధన ద్వారా వెల్లడించారు.?
జ : కాల్షియం సిగ్నల్స్

18) పోర్బ్స్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కరెన్సీ గా ఏ కరెన్సీ నిలిచింది.?
జ : కువైట్ దినార్

19) పోర్బ్స్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అమెరికా డాలర్ మరియు ఇండియా రూపీ ఎన్నో స్థానంలో నిలిచాయి.?
జ : 10, 15